ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె. రాంబాబు వెల్లడించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టళ్లలో సురక్షితంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్