ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవు

AP: రాష్ట్రంలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో 2 రోజులు సెలవు ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్‌కు ముందు రోజు (FEB 26), పోలింగ్ రోజు (FEB 27) సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్ (MAR 3) రోజు కూడా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుమేట్, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలలో మొత్తంగా 16 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్