AP: నెల్లూరు రాంజీ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో 20 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. టీడీపీ దుర్మార్గ విధానాలను వ్యతిరేకిస్తూనే ప్రజలు పార్టీకి చేరువవుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.