పెంచిన టికెట్ ధరలో 20% వాటా.. ఎగ్జిబిటర్ల డిమాండ్!

AP: సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆదుకోవాలని సినీ ఎగ్జిబిటర్ల సంఘం మంత్రి కందుల దుర్గేశ్‌ను కోరింది. నష్టాల్లో ఉన్న థియేటర్లను రక్షించేందుకు పెద్ద సినిమాల అదనపు టికెట్ ధరలో 20% వాటా ఇవ్వాలని ప్రతిపాదించింది. మెయింటెనెన్స్ ఛార్జీలు AC థియేటర్లకు ₹15, నాన్ ACకి ₹7 పెంచడంతో పాటు విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులో రాయితీలివ్వాలని కోరింది. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్