ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని ఝలక్ ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు. నియోజకవర్గంలో టీడీపీకి కార్యకర్తలు వైసీపీలో చేరారు. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.