నూతన సంవత్సరాది 01/01/2026 తేదీని తలపించేలా ఉన్న కరెన్సీ నోట్లు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఏలూరుకు చెందిన నాణేల సేకరణకర్త అలీఖాన్ వద్ద '01-01-26' సీరియల్ నంబరు కలిగిన రూ.1, రూ.10 నోట్లు లభ్యం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అచ్చం క్యాలెండర్ తేదీని పోలిన ఈ నంబర్లు ఉండటంతో.. ఈ నోట్లు చూపరులను, సేకరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.