ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు శుభవార్త తెలిపారు. రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతి నాటికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. జాయింట్ ఎల్సీఎంలను సబ్ డివిజన్ చేయించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, భూముల రీ క్లాసిఫికేషన్ పై లక్ష ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.