సర్పంచ్‌ బరిలో 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థిని

AP: అనకాపల్లి జిల్లా, ఆర్‌.భీమవరం సర్పంచ్ ఎన్నికల బరిలో 21 ఏళ్ల బీటెక్ విద్యార్థిని బల్లిన మేఘన నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళా రిజర్వుడ్ స్థానం కావడంతో ఆమె నామినేషన్ వేశారు. తన తాత బల్లిన రాజునాయుడు 11వ తేదీన మృతి చెందగా, ఆ బాధలోనూ ఆమె ప్రజల కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు. మాజీ సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. టీడీపీ అభ్యర్థి మలిరెడ్డి లక్ష్మితో ఆమె హోరాహోరీగా పోటీ పడుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕