బజ్జీలు తిని 23 మందికి అస్వస్థత..!

AP: తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో కలుషితాహారం తిని 23 మంది అస్వస్థతకు గురయ్యారు. రహదారి పక్కన బండిలో విక్రయించే బజ్జీలు తినడంతో వాంతులు, విరేచనాలతో బాధపడినట్లు స్థానికులు తెలిపారు. వీరిలో కొందరు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతుండగా, మరికొందరు డిశ్చార్జి అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్