నేటితో వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు

AP: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 2003 ఏప్రిల్ 9న ప్రారంభమైన ఈ పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసిందని, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని జగన్ అన్నారు. ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు, పోలవరం ప్రాజెక్టు పనులకు వేగం వంటివి వైఎస్సార్‌ పాలనలో జరిగిన కీలక మార్పులని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని జగన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్