AP: అమెరికాలోని టంపా సిటీలో 24వ నాట్స్ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. నాట్స్ సభల్లో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పీ-4 విధానానికి పిలుపునిస్తూ స్టాల్ ఏర్పాటు చేశారు. క్రీడలు, క్రీడాకారులను దత్తత తీసుకోవాలంటూ చైర్మన్ రవినాయుడు బ్రోచర్ తయారుచేశారు. స్టాల్ ఏర్పాటులో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు భాగస్వాములయ్యారు.