AP: రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 133.3 కి.మీ పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌కు ప్రణాళిక రూపొందించామని, జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. 22 రోడ్లలో రెండువైపులా బఫర్ జోన్‌లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతుందని, రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు.