AP: విశాఖపట్నం జిల్లాలో వైసీపీలో సుమారు 300 మంది యువకులు, మహిళలు చేరారు. మాధవదార కళ్యాణి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యాలతో పార్టీ ముందుకు సాగుతోందని, పార్టీలో చేరిన వారందరూ అంకితభావంతో పనిచేయాలని కన్నబాబు సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రజల పక్షాన నిలుస్తుందని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు.