చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది పార్లమెంట్‌లో చట్టరూపం దాల్చేలా చర్యలు చేపడతామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. చేనేత మగ్గాల కోసం రూ.50 వేల సాయం అందిస్తాం. చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా చేనేతలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తాం.’ అని తెలిపారు.