నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్షించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయ పరమైన పోరాటం చేయాలని సీఎం నిర్ణయించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై సమీక్షలో చర్చించారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్