AP: 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మేలు చేస్తోందని, వారి జీవితాల్లో ఇది గొప్ప మార్పు తెచ్చిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు 40 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని, మహిళా ప్రయాణికులు 40% నుంచి 63.4 శాతానికి పెరిగిందని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా 1,413 అదనపు ట్రిప్పులు, 64,647 అదనపు కిలోమీటర్లు నడుపుతున్నామని, ఆర్టీసీకి రూ.1,388 కోట్లు సబ్సిడీగా ఇచ్చామని వివరించారు.