AP: పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పచ్చ కామెర్లతో మరో గిరిజన విద్యార్థి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. మూల వలస గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు, ఎర్ర సామంత వలస గిరిజన స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు పచ్చ కామెర్ల వ్యాధితో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మన్యం ప్రాంతంలో వరుసగా గిరిజన విద్యార్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.