ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: సీఎం చంద్రబాబు

AP: అర్హులైన ప్రతి ఒక్కరికీ గడువులోగా ఇళ్ళు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం  చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల కొందరు వెళ్లడం లేదని, అలాంటి వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్