చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

AP: రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. హౌరా-చెన్నై మెయిల్‌ జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ముగ్గురు యువకులు ఒక్కొక్కరి వద్ద మూడు ప్యాకెట్ల చొప్పున రెండు కేజీల చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయిని సీజ్‌ చేశారు. ఒడిశాకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న మరో రైలులో ఇద్దరి నుంచి 13 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕