AP: రాష్ట్రంలో 5,026 మంది లబ్ధిదారులకు శనివారం కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ-సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మోర్టార్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 గంటల్లో 5,026 ఈ-సైకిళ్ల పంపిణీ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించనుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. గుడుపల్లె మండలం గుత్తార్లపల్లె పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఈ-సైకిళ్లను గురువారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు