వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొని రూ.1,680 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. వారం రోజుల్లో రూ.680 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అలాగే జంగారెడ్డి గూడెం నుంచి భీమవరం వరకు ఎర్రకాలువను అభివృద్ధి చేస్తామన్నారు.