AP: కూటమి ప్రభుత్వంలో 21 మంది వైసీపీ కార్యకర్తలతో సహా 700 మంది హత్యకు గురయ్యారని భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి దశ నుంచే హింసా, కుల రాజకీయాలకు తెర తీశారని, ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతోందని ఆరోపించారు. చంద్రబాబు రాజారెడ్డి హంతకులకు ఆశ్రయం ఇచ్చినా, రంగా హత్య వెనుక ఉన్నా అవి ప్రజల్లోకి వెళ్లలేదని భూమన పేర్కొన్నారు.