AP: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు పోలీసులు, విద్యార్థులు కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.