AP: పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీ పురం డంగభద్ర గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. డోలుకోన, కీసరగూడ గ్రామాల నుంచి మరికొన్ని కుటుంబాలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించాయి. స్థానిక క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, కురుపాం ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ జోగి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.