75 ఏళ్ల వృద్ధురాలి కడుపులో 10 కిలోల గడ్డ తొలగింపు!

AP: నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన 75 ఏళ్ల సుబ్బ లక్ష్మమ్మ, ఆరు నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆమె కడుపులో 30x25 సెం.మీ. పరిమాణంలో, సుమారు 10 కిలోల బరువున్న అండాశయ క్యాన్సర్ గడ్డను గుర్తించారు. మే 1న డాక్టర్ నరేష్ కుమార్ బృందం సుమారు గంటల తరబడి శ్రమించి, విజయవంతంగా ఆ గడ్డను తొలగించి, ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం సుబ్బ లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్