జనసేన నేత వినూత్ డ్రైవర్ హత్య ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. “నేరస్థుడికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. నేరం చేసినవారు ఎవరైనా కఠినంగా శిక్షించబడతారు. ఈ అంశాన్ని పొలిటికల్‌గా మాట్లాడుకోవడమే బానే కనిపిస్తోంది. కానీ, నేరం చేసిన వారికి శిక్ష తప్పదు” అని వ్యాఖ్యానించారు. హత్యపై ఆల్‌రెడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చారు.