దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతం

AP: దక్షిణ ఒడిశా భూభాగంపై వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, ఎల్లుండి ఉదయానికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕