చెల్లెలి పెళ్లి విషయంలో గొడవ.. తండ్రి గొంతు కోసి చంపిన తనయుడు

AP: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తొర్రేడు గ్రామంలో చెల్లెలి పెళ్లి విషయంలో తలెత్తిన వివాదంలో కొడుకు సాయికుమార్ తన కన్న తండ్రి అప్పారావు (49)ను గొంతు కోసి హత్య చేశాడు. రూ.2 లక్షల కట్నం ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో గురువారం కుమారుడు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆవేశంతో తండ్రి తలను గోడకేసి కొట్టి, ఆపై కూరగాయలు కోసే చాకుతో గొంతు కోసి చంపాడు. అడ్డుకోబోయిన తల్లి, సోదరిని గదిలో బంధించాడు.

సంబంధిత పోస్ట్