కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని, సీనియర్లను పట్టించుకోవడం లేదని, తమ కుటుంబ పెత్తనమే సాగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యేకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. తిరుగుబాటు వర్గం కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసింది.