AP: తూ.గో. జిల్లా చాగల్లు మండలం ఉనగట్టకు చెందిన వీరవల్లి శివరామకృష్ణ మాజీ సీఎం జగన్‌కు వీరాభిమాని. అయితే స్నేహితులతో పందెం కట్టి అరగుండు గీయించుకున్నాడు. వైసీపీ అధికారం కోల్పోతే తాను అరగుండు గీయించుకుంటానని ఎన్నికలకు ముందు స్నేహితులతో పందెం వేశాడట. టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో శివరామకృష్ణను స్నేహితులు ప్రశ్నించగా.. ఇచ్చిన మాట ప్రకారం అరగుండు గీయించుకున్నాడని తెలిసింది.