ఏపీలో గత ఏడాది ఎన్నికల సమయంలో టికెట్ పోగొట్టుకున్న సీనియర్ నాయకులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరిలో పిఠాపురం వర్మ ఒకరు. ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కూడా టికెట్ వదులుకోవాల్సి వచ్చినవారి లిస్ట్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో వీరిద్దరూ ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. అయితే దేవినేని ఉమా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నాయకులకు కూడా ఆయన దూరంగా ఉంటున్నట్లు సమాచారం.