AP: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఆదివారం సాయంత్రం ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద పెరుగుతుండటంతో 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 455 గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. వెంటనే అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.