ఏపీలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. నూజివీడు మండలం వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవాహించటంతో కొందరు వరదలో చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్థులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ తాడును ఓ వ్యక్తి కేవలం ఒంటి చేతితో పట్టుకోవడంతో అదుపుతప్పి స్థానికులు చూస్తుండగానే కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోయిన వ్యక్తి చెట్ల మధ్య చిక్కుకుపోవడంతో స్థానికులు కాపాడారు.