AP: అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మమతా అనే మహిళను ఆమె భర్త తిప్పేస్వామి రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న SI రాంభూపాల్, మమత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.