ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కొత్త మార్పులు మనం చూడబోతున్నాం అన్నారు. గత పదేళ్లలో ఢిల్లీ వెనుకబాటుకు గురైందని, రాబోయే రోజుల్లో ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.