ఏపీ తీరం వైపు దూసుకొచ్చిన అర్నబ్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియను ప్రారంభించింది. మరో గంటన్నరలో యానాం సమీపంలో ఇది పూర్తిగా తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని ఎస్డీఎంఏ (SDMA) పేర్కొంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా వంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.