AP: శ్రీకాకుళం నుంచి విమానాశ్రయానికి చేపల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ సోమవారం ఉదయం వేగంగా వచ్చి, కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుపై పడిన చేపలను స్థానికులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల రద్దీ లేని సమయంలో ఘటన జరగడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ట్రాఫిక్ సీఐ ఎన్.సాయి తెలిపారు.