AP: అర్నబ్ అతి తీవ్ర తుఫాన్ వేగంగా ముందుకు కదులుతోంది. తుఫాన్ బాహ్య వలయం భూభాగాన్ని తాకుతోంది. బుధవారం తెల్లవారుజామున 2-4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో తుఫాన్ దూసుకొస్తోంది. విశాఖపట్నంకు 170 కి.మీ, కాకినాడకు 90 కి.మీ, మచిలీపట్నంకు 170 కి.మీ, బాపట్లకు 240 కి.మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఉ.8.30 గంటల నుంచి 28 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి.