గంటకు 18KM వేగంతో కదిలిన అతితీవ్ర తుఫాన్

AP: గడిచిన 6 గంటల్లో గంటకు 18KM వేగంతో అర్నబ్ అతితీవ్ర తుఫాన్ ముందుకు కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, మచిలీపట్నంకు 230 కి.మీ, బాపట్లకు 300 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. బుధవారం ఉదయానికి బాపట్ల-విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది. కాసేపట్లో పోలవరం, కోనసీమ, కాకినాడ, ఉ.గోదావరి, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయంది.

సంబంధిత పోస్ట్

✕
✕