పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

AP: కర్నూలులోని దోని మండలం ధనాపురం గ్రామ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న రాజేశ్‌ (24) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఓ వివాహ కార్యక్రమం కోసం వెళ్లి రాజేష్, ఈరన్న బైక్‌పై తిరిగి ఆదోనికి వస్తున్నారు. ఈ క్రమంలో ధనాపురం సమీపంలో ఓ గేదె  అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇరువురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేశ్‌ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్