AP: అనంతపురంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శ్రీనివాసనగర్‌కు చెందిన యువతి బీటెక్ చేసి బెంగళూరు వెళ్లి కోర్సు చేస్తే ఉద్యోగం వస్తుందని, ఇంట్లో చెప్పి ఈ నెల 20న బయటకు వెళ్లి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.