డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని వేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటతామని అన్నారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మారుతున్నాయని చెప్పారు.