AP: వైఎస్సార్ కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రహరీని ఢీకొని సిమెంట్ లోడుతో ఉన్న లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనమైనట్లు సమాచారం. అటవీ ప్రాంతం కావడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.