త్వరలో వీఓఏలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా: మంత్రి శ్రీనివాస్

AP: గ్రామ సంఘ సహాయకులకు (వీఓఏ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలోని వీఓఏలకు త్వరలో రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని రామవరప్పాడు ఎం కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్.. వీఓఏలకు ఉచిత స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీఓఏలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇది అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా 28,500 మందికి ప్రయోజనం కలగనుంది.

సంబంధిత పోస్ట్