చురుగ్గా ‘ఈశాన్యం'.. నేడు భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఈ నెల 22 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం 8 గంటల వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, అన్నమయ్య, కడప, ప్రకాశం మరియు కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕