వైసీపీ అధినేత జగన్ బంగారుపాళ్యంలో నిర్వహించిన పర్యటనలో భారీగా తరలివచ్చిన కార్యకర్తల కారణంగా వైసీపీ నేతలు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. జగన్‌తో హ్యాండ్ షేక్ కోసం కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు పరుగెత్తడంతో రోజా అక్కడే ఉండగా మధ్యలో తోపులాట జరిగింది. ఆమె ఇరుక్కుపోయిన సమయంలో తలశిల రఘురాం, సునీల్ కుమార్ ఆమెకు రక్షణగా నిలిచారు.