AP: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు 48వ డివిజన్‌లోని లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు అదనపు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయని, పేదల సొంతింటి కల నెరవేరుతుందని వారు పేర్కొన్నారు.