కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డిని 8 గంటల పాటు విచారణ

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు కూడా 8 గంటలు విచారించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద సిట్ తాత్కాలిక కార్యాలయంలో డీఐజీ మురళీ రాంబా, అధికార బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రొక్యూర్‌మెంట్ కమిటీ నిర్ణయంతో నెయ్యి కొన్నామని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు మౌనం వహించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్