తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. 2019-24 మధ్య జరిగిన తప్పిదాలపై సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దర్యాప్తులో తేలిన అంశాలను, దిద్దుబాటు చర్యలను లేఖలో ప్రస్తావించింది. ఈ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాక ప్రభుత్వం స్పందించనుంది. సిట్ క్లీన్‌చిట్ అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.