AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను కల్తీ మద్యం స్కామ్‌లో అరెస్ట్ చేసింది. గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించిన వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జోగి అరెస్టుతో, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ వంటి ఇతర నేతల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కొడాలి నాని అరెస్టుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని సమాచారం.